
మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మృతి
మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ ఆదివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ ఆదివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాల. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో ఆయన ఎన్.టీ.రామారావు కేబినేట్లోను, ఆ తదుపరి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
నిజమాబాద్ జిల్లా బోదన్ నుంచి బాబూఖాన్ 1985, 1994లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికైయ్యారు. గతంలో కేంద్రంలోని ఏన్డీఏ సర్కార్కు చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడంపై బాబుఖాన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ కారణంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.