'నానక్‌రామ్‌గూడా' బాధితులకు వైఎస్‌ జగన్‌ ఓదార్పు | Ensuring to the victims! | Sakshi
Sakshi News home page

'నానక్‌రామ్‌గూడా' బాధితులకు వైఎస్‌ జగన్‌ ఓదార్పు

Dec 20 2016 1:43 AM | Updated on Aug 8 2018 5:33 PM

'నానక్‌రామ్‌గూడా' బాధితులకు వైఎస్‌ జగన్‌ ఓదార్పు - Sakshi

'నానక్‌రామ్‌గూడా' బాధితులకు వైఎస్‌ జగన్‌ ఓదార్పు

హైదరాబాద్‌ భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి రావాల్సిన పరిహారం త్వరగా వచ్చేలా

- చిలకలపల్లిలో నానక్‌రామ్‌గూడా బాధితులకు జగన్‌ ఓదార్పు
- అన్ని పరిహారాలు వచ్చేదాకా పోరాడుతాం


సాక్షి ప్రతినిధి, విజయనగరం: హైదరాబాద్‌ భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి రావాల్సిన పరిహారం త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బిల్డర్‌ నుంచి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తానొస్తున్నాననే చంద్రన్న బీమా పంపిణీని ఆదరాబాదరాగా చేశారని విమర్శించారు. రావాల్సిన బీమాలను, ప్రయోజనాలను కల్పించేవరకూ పోరాడుతామని భరోసానిచ్చారు. ఆయన సోమవారం రాత్రి  విజయనగరం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో పర్యటించారు. నానక్‌రామ్‌గూడాలో ఈ నెల 8న నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement