విద్యుత్ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడీఈ, ఏఈలు, ఉద్యోగులను, సిబ్బందిని పుట్టుకను ఆధారం...
ఉద్యోగాల నుంచి తొలగిస్తారా?
నిరసన తెలిపిన విద్యుత్ అధికారులు, ఉద్యోగులు
కడప అగ్రికల్చర్ : విద్యుత్ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడీఈ, ఏఈలు, ఉద్యోగులను, సిబ్బందిని పుట్టుకను ఆధారం చేసుకుని దాన్నే స్థానిక ప్రామాణికంగా పరిగణించి తొలగించడం దారుణమని జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తు నిరసన తెలిపారు. శుక్రవారం జిల్లా అంతటా భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కడప నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్‌విఎస్ సుబ్బారాజు, టెక్నికల్ డీఈ బ్రహ్మానందరెడ్డి, డీఈలు శోభావాలెంతెనా, సురేష్‌కుమార్ మాట్లాడుతూ వెంటనే తొలగించిన వారందని విధుల్లోకి తీసుకోక పోతే తీవ్రస్థాయిలో పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలోని డివిజన్ల డీఈలు, ఏడీఈలు, ఉద్యోగులు నిరసన తెలిపారు.