ఎవరెస్టుపై మన్యం వీరులు

East Godavari Prasanna Kumar Climbed Mount Everest - Sakshi

అధిరోహించిన అడ్డతీగల గురుకుల విద్యార్థి

కూతవేటు దూరంలోమరో ముగ్గురు

చింతూరు (రంపచోడవరం): మన్యంవీరులు మరోమారు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటి రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి పెట్టారు. చింతూరు మండలానికి చెందిన దూబి భద్రయ్య శిక్షణలో జిల్లా నుంచి ఎవరెస్టు అధిరోహణకు వెళ్లిన నలుగురు గురుకుల కళాశాల విద్యార్థుల్లో అడ్డతీగలకు చెందిన ప్రసన్నకుమార్‌ గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరో హించినట్లు భద్రయ్య తెలిపారు. ప్రసన్నకుమార్‌తో పాటు నెల్లూరుకు చెందిన వెంకటేష్‌ అనే వి ద్యార్థి కూడా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడని ఆయన తెలిపారు. 87 వేల మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు మన రాష్ట్రానికి చెందిన పది మంది గురుకుల విద్యార్థులు గత నెల 18న బయలుదేరి వెళ్లారు. నేపాల్, చైనా, టిబెట్‌ మీదుగా ఎవరెస్టు శిఖరం వద్దకు చేరుకున్న వారు మైనస్‌ 40 డిగ్రీల చలిలో ఈ నెల 8న ఎవరెస్టు అధిరోహణ యాత్ర ప్రారంభించగా పది మందిలో ఇద్దరు విద్యార్థులు గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.

కూతవేటు దూరంలో మరో ముగ్గురు
జిల్లాకు చెందిన మరో ముగ్గురు గురుకుల విద్యార్థులు ఎవరెస్టు అధిరోహణలో కూతవేటు దూరంలో ఉన్నారు. చింతూరుకు చెందిన వీరబాబు, అడ్డతీగలకు చెందిన సత్యనారాయణ, మారేడుమిల్లికి చెందిన రమణారెడ్డి ఇప్పటి వరకూ 7,100 మీట ర్లు ఎక్కారని, మరో 1,600 మీటర్లు ఎక్కితే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారని, రెండు రోజుల్లో వారు ఈ ఘనత చాటుతారని కోచ్‌ భద్ర య్య తెలిపారు. వీరితోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెం దిన రమణమూర్తి, రేణుక, విశాఖపట్నం జిల్లాకు చెందిన రాంబాబు, వాసుదేవ, సింహాచలంకూడా ఎవరెస్టు అధిరోహణలో నిమగ్నమై ఉన్నారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top