ప్రతి దానికీ మీకే అనుభవం ఉందనొద్దు | Each option has the experience to you undanoddu | Sakshi
Sakshi News home page

ప్రతి దానికీ మీకే అనుభవం ఉందనొద్దు

Dec 19 2014 1:04 AM | Updated on May 29 2018 4:18 PM

ప్రతి దానికీ మీకే అనుభవం ఉందంటూ మాట్లాడొద్దని వైఎస్సార్‌సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ సీఎం చంద్రబాబుకు సూచించారు.

  • చంద్రబాబుకు జ్యోతుల నెహ్రూ సూచన
  • సాక్షి, హైదరాబాద్: ప్రతి దానికీ మీకే అనుభవం ఉందంటూ మాట్లాడొద్దని వైఎస్సార్‌సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ సీఎం చంద్రబాబుకు సూచించారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో చర్చల సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెహ్రూ ఈ విధంగా స్పందించినట్లు తెలిసింది. సభలో ఏ ప్రజాసమస్యపై చర్చకు ఎంత సమయం కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు గడికోట శ్రీకాంతరెడ్డి కోరినప్పుడు చంద్రబాబు తన అనుభవాన్ని ఏకరువు పెట్టిన ట్లు సమాచారం.

    ‘నేను పదేళ్లు సీఎంగా పనిచేశా. పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నా ను. నాకు అనుభవం ఉంది’ అని సీఎం అన్నట్లు తెలిసింది. దీనికి నెహ్రూ స్పందిస్తూ.. ‘మీకే అను భవం ఉందంటూ ప్రతి దానికీ ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడ్డం తగదు’ అని అన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు హేళనగా నవ్వడంతో నెహ్రూ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది.  
     
    రైతు ఆత్మహత్యలపై సంతాపానికి అధికారపక్షం అడ్డు!

    పెషావర్‌లో విద్యార్థుల మృతికి అసెంబ్లీలో సం తాప తీర్మానం పెట్టాలన్న అంశానికి బీఏసీలో ఏకాభిప్రాయం కుదిరింది. అయితే, హుద్‌హుద్ తుఫాను, రైతు ఆత్మహత్యలపై సంతాపం పెడదామని ప్రతిపక్షం ప్రతిపాదనను అధికారపక్షం  అడ్డుకున్నట్లు సమాచారం. హుద్‌హుద్ మృతులకు సంతాపం తెలపడానికి అభ్యంతరం లేదని  ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు స్పీకర్‌కు తెలియజేశారని తెలిసింది. అనంతపురం జిల్లావాసివై ఉండి రైతుల ఆత్మహత్యలపై సంతాప తీర్మానం పెట్టడాన్ని వ్యతిరేకించడం తగదని గడికోట శ్రీకాంతరెడ్డి అనగా.., మీరు రాజకీయం చేస్తున్నారంటూ కాలువ ధ్వజమెత్తినట్లు తెలిసింది. ఈ అంశాన్ని స్పీకర్ విచక్షణకు వదలేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement