కాళ్లు, చేతులు కట్టేసి వ్యక్తి హత్య! | durga prasad died at digamarru bypass road | Sakshi
Sakshi News home page

కాళ్లు, చేతులు కట్టేసి వ్యక్తి హత్య!

Published Tue, Jun 30 2015 7:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు బైపాస్ రోడ్డులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు బైపాస్ రోడ్డులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని గమనించిన ప్రయాణీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతుడిని రాజోలు మండలం చింతపల్లికి చెందిన యనముల దుర్గాప్రసాద్ (30)గా గుర్తించారు.

దుర్గాప్రసాద్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గమనిస్తే ఇది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు వారు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement