వివాహిత అనుమానాస్పద మృతి | doubtful death of a married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Feb 7 2015 8:13 PM | Updated on May 24 2018 12:31 PM

గుంటూరు జిల్లా వేమూరు మండలంలో శనివారం ఉదయం పెరికల సుమలత(26) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

గుంటూరు: గుంటూరు జిల్లా వేమూరు మండలంలో శనివారం ఉదయం పెరికల సుమలత(26) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. వివరాలు... సుమలత భర్త సురేశ్ పెయింటర్ పని చేస్తుంటాడు. కొన్ని రోజుల కిందట పని కోసం ప్రకాశం జిల్లా చీరాల వెళ్లాడు. దీంతో సుమలతకు తోడుగా తండ్రి ఉంటున్నాడు. శనివారం ఉదయం ఆమె విగత జీవిగా కనిపించింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(వేమూరు)

Advertisement
 
Advertisement
Advertisement