'మంచి నిర్ణయానికి జాప్యం తగదు' | don't delay for good decision, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

'మంచి నిర్ణయానికి జాప్యం తగదు'

Dec 25 2014 8:18 PM | Updated on May 3 2018 3:17 PM

'మంచి నిర్ణయానికి జాప్యం తగదు' - Sakshi

'మంచి నిర్ణయానికి జాప్యం తగదు'

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

విశాఖపట్నం: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. సుపరి పాలన దినోత్సవంలో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండకూడదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

స్మార్ట్ సిటీ అంశంపై త్వరలో విశాఖలో సదస్సు నిర్వహిస్తామన్నారు, విశాఖను నౌకాయాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అమెరికా సాంకేతిక సహకారంతో వైజాగ్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement