చేయి చేయి కలుపుదాం

Donation Collected For Kerala State Kurnool - Sakshi

కోసిగి (కర్నూలు): చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులను ఆదుకుందామని బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఖలీల్‌ అహ్మద్, ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్షులు రాముడు, నయకులు హొలగుంద కోసిగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోసిగిలో వరద బాధితుల సహాయార్థం వ్యాపార దుకాణాలు, ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేరళలో వరద ముంచుకొచ్చి ప్రజలు సర్వ కోల్పోయి నిరాశ్రులయ్యారు. విరాళాలు సేకరించిన వారిలో పీడీఎస్‌యూ డివిజన్‌ కార్యదర్శి లోకారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
 
మంత్రాలయం రూరల్‌: కేరళలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం తరుపున విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు విశ్వనాథ్, నవీన్‌ నేతృత్వంలో మండల కేంద్రంలో పర్యటించి రూ.39వేలు సేకరించారు. ప్రిన్సిపాల్‌ చేతుల మీదుగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో రఘు, జయలక్ష్మి, ఎల్లప్ప, అంజి, ప్రభుత్వ, రాఘవేంద్ర జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

 
కౌతాళం: మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం  విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి లింగన్న తెలిపారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వరదలతో నష్టపోయిన బాధితులకు విరాళాలు సేకరించామన్నారు. అలాగే కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ దూద్‌బాషా కుటుంబం కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రూ.12వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు దూద్‌ బాషా తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top