
ఆ ముసాయిదా బిల్లును ఆమోదించవద్దు
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన భూ సేకరణ బిల్లు ముసాయిదాను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి
రాష్ట్రపతికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన భూ సేకరణ బిల్లు ముసాయిదాను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ప్రజా ప్రయోజనాలకు, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుకు విఘాతం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, భూ సేకరణ చేయాలంటే బహిరంగ విచారణ, సామాజిక ప్రభావ మదింపు వంటివి చేయాల్సి ఉందని, కానీ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో అవేవీ లేవని తెలిపారు.