breaking news
Property right
-
రెండవ భార్యకీ – తన పిల్లలకూ భర్త ఆస్తిలో, పెన్షన్‌లో హక్కు ఉంటుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చని΄ోయిన తర్వాత, లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండోపెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతోపాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చని΄ోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతాయి.అయితే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్ కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కానీ పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్‌లో ఎటువంటి హక్కూ ఉండదు. అయితే అన్ని వేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలంటూ చని΄ోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం. అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికీ, మెయింటెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికీ తేడా ఏమీ లేదని అంటూ, భర్త బతికివుండగా మొదటి భార్యకు రావలసివున్న మెయింటెనెన్స్ బకాయిలు కూడా తనకు ఇవ్వాలి అని కోర్టు పేర్కొంది. మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం పెన్షన్ రూల్స్‌లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుందని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి కాబట్టి కేసు పూర్వాపరాలను బట్టి కొన్ని హక్కులు రెండవ భార్యకూ వర్తిస్తాయా లేదా అన్నది పూర్తిగా ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు చట్టాన్ని ఆశ్రయిస్తే తగిన ఉపశమనం దొరికే ఆస్కారం ఉంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)(చదవండి: Pregnant Women: బీకేర్‌ఫుల్.. మార్నింగ్ సిక్‌నెస్‌ని లైట్ తీసుకోవద్దు!) -
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్‌కు అదనంగా మరో 224 ఆర్టికల్స్‌ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
ఆ ముసాయిదా బిల్లును ఆమోదించవద్దు
రాష్ట్రపతికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన భూ సేకరణ బిల్లు ముసాయిదాను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ప్రజా ప్రయోజనాలకు, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుకు విఘాతం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, భూ సేకరణ చేయాలంటే బహిరంగ విచారణ, సామాజిక ప్రభావ మదింపు వంటివి చేయాల్సి ఉందని, కానీ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో అవేవీ లేవని తెలిపారు. -
ఆస్తిహక్కుపై సుప్రీం సంచలన తీర్పు
పెళ్లయిన మహిళలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కట్టుకున్న భార్యకు, ఏకైక కొడుక్కి ఏమీ ఇవ్వకుండా.. పెళ్లయిన కుమార్తెకు మొత్తం ఆస్తిని ఇచ్చేయొచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. పశ్చిమబెంగాల్ సహకార సంఘాల నిబంధనల ప్రకారం సొసైటీలోని ఒక ఫ్లాట్ ఓనర్ తన తర్వాత ఆ ఇంటిని కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వొచ్చని ఉంది. ఈ నిబంధనను చూపిస్తూ, తన భర్త కొనుగోలు చేసిన ఫ్లాట్ యాజమాన్యాన్ని మేనేజింగ్ కమిటీవాళ్లు తమ పెళ్లయిన కుమార్తె ఇంద్రాణికి ఇవ్వడాన్ని సవాలుచేస్తూ విశ్వరంజన్ సేన్‌గుప్తా భార్య, కుమారుడు హైకోర్టుకెక్కారు. తన భార్య, కొడుకు తనను సరిగ్గా చూడకపోవడంతో చివరి రోజుల్లో సేన్‌గుప్తా తన కుమార్తె వద్దే ఉండేవారు. ఈ కేసులో ఇంద్రాణి అప్పీలు చేయగా, ఆ ఫ్లాట్‌ను ఆమె పేరు మీద రిజిస్టర్ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆమె తల్లి డివిజన్ బెంచికి అప్పీలు చేశారు. మొత్తం ఆస్తిలో ఇంద్రాణి కూడా ఒక భాగస్వామి అవుతారు తప్ప మొత్తం ఆస్తికి ఏకైక హక్కుదారు కాదని డివిజన్ బెంచి తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలుచేస్తూ ఇంద్రాణి సుప్రీంను ఆశ్రయించారు. ఈ మొత్తం అంశాన్ని పరిశీలించిన జస్టిస్ జేఎస్ ఖేకర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. సహకార సంఘంలో సభ్యుడు తనకు కావల్సినవాళ్లను నామినేట్ చేసుకోవచ్చని, ఆ సభ్యుడు మరణించిన తర్వాత సొసైటీ తప్పనిసరిగా సదరు నామినీ ప్రయోజనాలను తప్పనిసరిగా కాపాడాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.


