మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ | DNA samples taken from relatives of bus accident victims | Sakshi
Sakshi News home page

మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ

Oct 31 2013 9:21 AM | Updated on Oct 8 2018 5:04 PM

మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ - Sakshi

మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ

మహబూబ్ నగర్ బస్సు ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి బంధువులు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు.

మహబూబ్ నగర్ బస్సు ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి బంధువులు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృత దేహాలను గుర్తించేందుకు బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలను ఆస్పత్రి సిబ్బంది సేకరించారు.

బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సులో మంటలు చేలరేగడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గుర్తించడానికి వీలులేకుండా కాలిపోయాయి. వీటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించడం కోసం బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఏలూరుకు చెందిన స్రవంతి,  ఆసీఫ్ అహ్మద్ (బెంగళూరు), చంద్రశేఖర్ షిల్గే (మహారాష్ట్ర), జ్యోతిరంజన్ సాహూ (ఒడిశా), అశుతోష్ పాండాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement