వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు! | discussion of rtc workers that only be their wish, says sidda raghavarao | Sakshi
Sakshi News home page

వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు!

May 7 2015 6:49 PM | Updated on Sep 3 2017 1:36 AM

వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు!

వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు!

గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆ సమ్మెను విరమించాలని మంత్రి శిద్ధా రాఘవరావు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్:గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆ సమ్మెను విరమించాలని మంత్రి శిద్ధా రాఘవరావు విజ్ఞప్తి చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని.. ఒక వేళ వారు చర్చలకు వస్తే మాత్రం మాట్లాడతామని స్పష్టం చేశారు.  ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని .. తాము 27 శాతానికి మించి ఫిట్ మెంట్ ఇవ్వలేమని మంత్రి శిద్ధా పేర్కొన్నారు. ఎంసెట్ విద్యార్ధుల కోసం ప్రతి జిల్లాలో 200 బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement