ప్రేమ పేరుతో ఆకతాయి.. పోలీసుల సలహాలు | Dharmavaram Police Not Taking Complaint Against Romios | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు స్వీకరించకుండా ఉచిత సలహాలిస్తున్న పోలీసులు

May 7 2018 3:07 PM | Updated on Aug 21 2018 6:08 PM

Dharmavaram Police Not Taking Complaint Against Romios - Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రతా లేకుండాపోయింది. మొన్న దాచేపల్లి, నేడు గుంటూరు.. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఆడపిల్లల ఫిర్యాదులను చాలా తేలికగా తీసుకుంటున్నారు పోలీసులు. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి తమను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇద్దరు అక్కాచెల్లెలు ధర్మవరం పోలీసులను సంప్రదించారు. శాంతినగర్‌కు చెందిన ఓబులేష్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తమ వెంటపడి వేధిస్తున్నాడని తెలిపారు.

అయితే ఆ ఆడపిల్లలకు ధైర్యం చెప్పి, వారి ఫిర్యాదు స్వీకరించకుండా, కేసు నమోదు చేసుకోకుండా పోలీసులు విచిత్రంగా ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ యువకుడు కనిపిస్తే మాకు ఫోన్‌ చేసి చెప్పండి అంటూ హేళన చేస్తూ.. మాట్లాడారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థి, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వైపు ఆడపిల్లలపై రోజుకో దారుణం చోటుచేసుకుంటుంటే, పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తప్పు పడుతున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement