కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామానికి చెందిన ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామానికి చెందిన ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన నాగమల్లీశ్వరి(20) డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటోంది. శనివారం ఉదయం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించింది. దీంతో పండగ పూట విద్యార్థిని ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా.. ఆత్మహ్యతకు గల కారణాలు తెలయరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


