చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించకూడదు: డీఎస్ | D.Srinivas angry on Chandrababu Naidu on PPA issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించకూడదు: డీఎస్

Jun 20 2014 3:37 PM | Updated on Sep 2 2017 9:07 AM

చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించకూడదు: డీఎస్

చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించకూడదు: డీఎస్

రాష్ట్రాలు రెండైనా తెలుగుజాతి ఒక్కటే అన్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: రాష్ట్రాలు రెండైనా తెలుగుజాతి ఒక్కటే అన్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
విద్యుత్ కోనుగోళ్ల ఒప్పందాల (పీపీఏ) రద్దు అంశంపై చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎస్ ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంపై చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరించవద్దని డీఎస్ సూచించారు. రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని డీఎస్ అన్నారు. 
 
ఉత్తరప్రదేశ్ యూపీ సర్కార్‌ పన్ను షరతులు సూచించడం వల్ల ఉత్తర తెలంగాణకు చమురు రవాణా నిలిచిపోయిన అంశాన్ని మీడియాకు డీఎస్ వెల్లడించారు. ఇకముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే చమురు సంక్షోభం తలెత్తుందని ఆయన తెలిపారు. చమురు సంక్షోభం రాకుండా తెలంగాణ ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement