ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ | Cricket betters arrested in Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

Feb 27 2015 11:13 PM | Updated on Sep 2 2017 10:01 PM

ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో శుక్రవారం జరిగింది.

ఏలూరు(పశ్చిమగోదావరి): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో శుక్రవారం జరిగింది. వివరాలు..పట్టణంలోని గొల్లయ్యగూడెం రాజీవ్‌గృహకల్ప నివాసంలో బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బెట్టింగ్ స్థావరంపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టణంలోని తూర్పు వీధికి చెందిన చెన్నశెట్టి రామారావు, దొరగాడ శ్రీనివాస్‌లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.13,100, 15 సెల్‌ఫోన్‌లు, ఒక టీ.వీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement