ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య | Couple in love commits suicide at Adilabad district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

Dec 21 2013 7:33 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారంలో శనివారం చోటుచేసుకుంది. కలిసి జీవించలేక, కలిసి మరణించాలని ఆ ప్రేమజంట నిర్ణయించుకుంది.

ఆదిలాబాద్: ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారంలో శనివారం చోటుచేసుకుంది. కలిసి జీవించలేక, కలిసి మరణించాలని  ఆ ప్రేమజంట నిర్ణయించుకుంది. దీంతో వారిద్దరూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిద్దరి పరిస్థితి విషమించడంతో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ ప్రేమజంట మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతులు వనజ(16), రంజిత్‌(20)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కరీంనగర్‌ సారంగాపూర్‌ మండలం మంగల వాసులుగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.

వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడం చేతనే ఈ అఘాయిత్యానికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement