కరోనా: రెండు చోట్ల ప్లాస్మా సేకరణ

Coronavirus: Dr Prabhakar Reddy Says Plasma Therapy Started In AP - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తుగా ప్లాస్మా సేకరణకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రెండు చోట్ల ప్లాస్మా సేకరణ చేయనున్నట్లు కోవిడ్‌-19 స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ నోడల్‌ అధికారి డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్విమ్స్, కర్నూలు మెడికల్ కాలేజిలో ప్లాస్మా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి 14 రోజుల తర్వాత వారి ప్లాస్మా సేకరిస్తే, యాంటీ బాడీస్‌ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపతుందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం ప్లాస్మా సేకరణ మాత్రమే చేస్తున్నామని డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. (ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు..)

సిరియా దేశంలో ప్లాస్మా సేకరణ కరోనా బాధితులకు యంటీ బాడీస్‌ అభివృద్ధికి ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. ఇక సేకరించి ప్లాస్మాను -40 డిగ్రీల వద్ద ప్రిజర్వ్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు 14 రోజులు తర్వాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వటం ద్వారా కరోనా బాధితులకు మేలు చేసినట్లు అవుతుందని ఆయన చెప్పారు. (గ్యాస్‌ లీక్‌ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top