పిడుగుపాటుకు దంపతులు బలి జూలూరుపాడు, | Continuous rain struck by lightning a couple julurupadu sacrifice, | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు దంపతులు బలి జూలూరుపాడు

Aug 16 2013 4:33 AM | Updated on Sep 1 2017 9:51 PM

పిడుగుపాటు దంపతులను బలితీసుకుంది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన భార్య,భర్తలు భూక్యా దీప్లా(38), భూక్యా పద్మ(35) గురువారం పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు.

 పిడుగుపాటుకు దంపతులు బలి
 జూలూరుపాడు, న్యూస్‌లైన్: పిడుగుపాటు దంపతులను బలితీసుకుంది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన భార్య,భర్తలు భూక్యా దీప్లా(38), భూక్యా పద్మ(35) గురువారం పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు. గ్రామస్తుల  కథనం ప్రకారం....  భూక్యా దీప్లా, పద్మ రోజు వారి పనిలో భాగంగా పత్తి పంటకు మందు కొట్టేందుకు పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం వస్తుండడంతో పొలంలో ఉన్న వేప చెట్టు  కిందకు చేరారు. ఇంతలోనే అకస్మాత్తుగా పిడుగు పడడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు.
 
   పొలానికి వెళ్లిన వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో దీప్లా బంధువులు   వెళ్లి చూడగా చెట్టు కింద ఇరువురు చనిపోయి కనిపించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు ఆర్‌ఐ కె.నరసింహారావు, వీఆర్‌ఓ వీరన్న, ఎస్‌ఐ ఆర్.అంజయ్య  సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనతో సాయిరాంతండాలో తీవ్ర విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement