వైఎస్ఆర్ సీపీ బంద్కు కాంగ్రెస్ మద్దతు | Congress to support ysrcp ap bandh, sasy raghuveera reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ బంద్కు కాంగ్రెస్ మద్దతు

Jul 30 2016 1:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

వైఎస్ఆర్ సీపీ బంద్కు కాంగ్రెస్ మద్దతు - Sakshi

వైఎస్ఆర్ సీపీ బంద్కు కాంగ్రెస్ మద్దతు

ఆగస్ట్ 2న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆగస్ట్ 2న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు  కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన ఏపీ బంద్ విజయవంతం కావాలన్నారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీలకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదని రఘువీరా విమర్శించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement