హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇచ్చేందుకు రాష్ట్రానికి ఓ బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు ఆయన చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోడానికి కేంద్రం నుంచి వీలైనంత సాయం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.