స్టీల్‌ప్లాంట్‌ స్థలాన్ని సిద్ధం చేయండి | CM YS Jagan review on Kadapa steel plant construction | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ స్థలాన్ని సిద్ధం చేయండి

May 19 2020 4:31 AM | Updated on May 19 2020 4:59 AM

CM YS Jagan review on Kadapa steel plant construction - Sakshi

క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ ప్లాంట్‌కు భాగస్వామ్య సంస్థల కోసం ఓ పక్క ప్రయత్నిస్తూనే.. మరోవైపు నిర్మాణ ప్రారంభానికి చేపట్టాల్సిన పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌ నిర్మా ణం విషయంలో అనుసరించాల్సిన వ్యూహం పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాల యంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జాయింట్‌ వెంచర్‌ వచ్చేలోగా ప్లాంట్‌ కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని నిర్మాణానికి సిద్ధం చేయడం చాలా ముఖ్యమని, దీనిపై దృష్టి పెడితే చాలా సమయం ఆదా అవుతుం దన్నారు. ఇదే సమయంలో ప్లాంట్‌ నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ముఖ్యాంశాలు..

► ఎలాంటి ఉత్పత్తులు చేస్తే డిమాండు ఉంటుంది, దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఎలా లభిస్తుంది? తదితర అంశాలను విస్తృతంగా చర్చించారు. 
► ఉత్పత్తులకు అనుగుణంగా ప్లాంట్‌ నిర్మాణంలో వివిధ దశలను ఎలా ప్రా రంభించాలన్న దానిపైనా మాట్లాడారు.
► ప్రఖ్యాత ఉక్కు తయారీ సంస్థల భాగస్వామ్యం, ఇందుకు జరపాల్సిన సంప్రదింపులపైనా చర్చ జరిగింది. 
► అలాగే, ఉక్కు రంగంలో ప్రముఖుడు, ‘సెయిల్‌’ మాజీ సీఎండీ సీఎస్‌ వర్మ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడారు
► ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఉన్న పరిస్థితులను చర్చించారు. 
► ముడి ఖనిజం సరఫరా, రవాణా, ఉత్ప త్తులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై తన అభిప్రాయాలను వర్మ వివరించారు. 
► కడప స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామ్యానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తాయని వర్మ చెప్పారు.
► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అ«ధికారులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement