క్రిస్మస్ కాంతులు | Christmas celebrations | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ కాంతులు

Dec 25 2013 2:49 AM | Updated on Sep 2 2017 1:55 AM

క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ వేడుకలు

దయ, జాలి, సేవాతత్పరత, త్యాగాలకు ప్రతీకగా నిలిచి.. లోకానికి శాంతి మార్గాన్ని ప్రబోధించిన ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ‘పశ్చిమ’ ముస్తాబైంది.

దయ, జాలి, సేవాతత్పరత, త్యాగాలకు ప్రతీకగా నిలిచి.. లోకానికి శాంతి మార్గాన్ని ప్రబోధించిన ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ‘పశ్చిమ’ ముస్తాబైంది. జిల్లాలోని చర్చిలన్నీ విద్యుత్ అలంకరణలతో కాంతులీనుతున్నారుు. క్రీస్తు రాకను స్వాగతిస్తూ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు బిషప్ హౌస్‌లో మంగళవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ క్రిస్మస్ కేకును కట్‌చేసి బిషప్ పొలిమేర జయరావుకు తినిపించారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు, ఏలూరు పీఠాధిపతి శ్రీరాజు, ఫాదర్ మోజెస్, ఫాదర్ ఆబ్రహం, ఫాదర్ బాల, మైనార్టీ కార్పొరేషన్ ఈడీజలీల్ అహ్మద్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement