చిట్టిల పేరుతో ఘరానా మోసం | Chit fund fraud Nancharamma vacates house, leaves with Rs 1 crore | Sakshi
Sakshi News home page

చిట్టిల పేరుతో ఘరానా మోసం

Jul 4 2014 10:53 AM | Updated on Sep 2 2017 9:48 AM

చిట్టిల పేరుతో ఓ మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపి పెట్టి.... అర్థరాత్రి తట్టా బుట్టా సర్ధుకుని ఉడాయించింది.

చిట్టిల పేరుతో ఓ మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపి పెట్టి.... అర్థరాత్రి తట్టా బుట్టా సర్ధుకుని ఉడాయించింది. ఆ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని రెల్లి కాలనీలో చోటు చేసుకుంది. రెల్లి కాలనీలో నివసిస్తున్న నాంచరమ్మ అనే మహిళ స్థానిక మహిళలతో ఎంతో చనువు, నమ్మకంగా ఉంటూ వారితో చీటీలు కట్టించుకుంటుంది.ఆ క్రమంలో కొంత కాలం వరకు సక్రమంగా చిట్టిల డబ్బులు చెల్లించేది.

 

కొంతకాలం తర్వాత నగదు చెల్లించాలంటూ చిట్టిల కట్టిన సదరు మహిళలు వస్తుండటంతో తర్వాత ఇస్తానంటూ చెబుతు వస్తుంది. దాంతో చిట్టి వేసిన మహిళలు తమకు డబ్బు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. దాంతో గత అర్థరాత్రి ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ విషయాన్ని గమనించిన బాధితులు లబోదిబోమంటూ బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement