Nancharamma
-
పుడమి మిత్ర
చదువు పాఠశాల దాటక ముందే ఆమెకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఆ గృహిణి అంతటితో ఆగిపోలేదు. భర్త తోడ్పాటుతో ముందడుగు వేసి ప్రైవేటుగా చదువు కొనసాగించింది. డిగ్రీ పూర్తి చేసింది. మహిళా స్వయం సహాయక సంఘంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగింది. ఆ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంది. తమ పొలంలో ఆచరిస్తూ పట్టు సాధించింది. ప్రకృతి సేద్య శిక్షకురాలిగా ఎదిగింది. హిందీ నేర్చుకుంది. ఇతర రాష్టాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇచ్చి వచ్చింది. పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ మహిళా రైతు ఎంత ఎత్తుకు ఎదగగలరో నిరూపించిన నాంచారమ్మకు జేజేలు! చిత్తూరు జిల్లా సోమల మండలం పొదలగుంటపల్లె పంచాయతీ తుగడం వారి పల్లెకు చెందిన ఈశ్వరమ్మ, చెంగల్రాయులు దంపతుల రెండో సంతానం నాంచారమ్మ. ఆమెకు అక్క సుధారాణి, తమ్ముడు విజయ్కుమార్, చెల్లెలు రజని ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. నాంచారమ్మకు చిన్ననాటి నుంచే సేద్యంపై మక్కువ. 9వ తరగతి చదివే రోజుల్లోనే ఆమెకు వెంకటరత్నంతో వివాహమైంది. ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత భర్త సహకారంతో ఆమె చదువు పునఃప్రారంభించారు. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. 3 నెలల పాటు కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2000వ సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘంలో చేరారు. మండల సమాఖ్య కార్యదర్శిగా, జిల్లా సమాఖ్య ఈసీగా పనిచేశారు. మార్కెటింగ్ కమిటీ సభ్యురాలిగా, మార్కెటింగ్ విభాగంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ గా విధులు నిర్వర్తించారు. తదనంతర కాలంలో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ప్రధాన పంటలో 20 అంతర పంటలుస్వగ్రామంలో తమ రెండెకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టారు. ఆ పొలంలో అప్పటికే ఏడాది క్రితం నాటిన మామిడి మొక్కలకు 400 కేజీల ఘన జీవామృతం వేసి, అంతరపంటగా వేరుశనగ సాగు చేశారు. ప్రధాన పంటలతో పాటు 20 రకాల అంతర పంటలను సాగు చేస్తున్నారు. వేరుశనగ, అనప, అలసంద, కంది, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, ఆముదం, బెండ, టమాటా, గోరుచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, సజ్జ, గుమ్మడి, బీర, కాకర, సొర, కీర, ఉలవ తదితర పంటలను పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. → ‘ప్రకృతి వ్యవసాయంలో మొదటి సంవత్సరమే సాధారణ లాభాలు వచ్చాయని, రెండో ఏడాది నుంచి 10 శాతం అధిక దిగుబడి సాధించినట్లు నాంచారమ్మ తెలిపారు.→ ప్రకతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువగా ఉంటుందని నాంచారమ్మ చెబుతున్నారు. రసాయన ఎరువులు వాడి వేరుశనగ పంట సాగు చేస్తే ఎకరాకు విత్తనకాయలు, కూలీలు, ఎరువులు మొత్తం కలిపి రూ.35 నుంచి రూ.40 వేలు ఖర్చవుతుంది. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే రూ.10–20 వేలు చాలన్నారు. → పట్టభద్రురాలై ఉండటం, అనంత మహిళా సమాఖ్య గ్రూపుల సహకారంతో హిందీ భాషపై పట్టు సాధించటంతో ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో ఆమెకు ప్రాధాన్యం దొరికింది.– యెండ్లూరి మోహన్ , సాక్షి తిరుతి డెస్క్, సహకారం: తుడుము తులసీరామ్, పాకాల -
జాతీయాలు
నాంచారమ్మ వంట! వెనకటికి నాంచారమ్మ అనే పెద్దవ్వ ఉండేదట. ఇంటికి వచ్చిన అతిథులను ఘనంగా ఆదరించేదట. అయినా సరే, ఆమె ఇంటికి వెళ్లడానికి అతిథులు వెనకా ముందు ఆలోచించేవారట. దీనికి కారణం... వంట పేరుతో ఆమె విపరీతమైన జాప్యం చేయడం. ‘ఇదిగో అయింది’ ‘అదిగో అయింది’ అంటూ ఆలస్యం చేసేదట. పొద్దున వచ్చిన అతిథి భోజనం చేయడానికి ఏ అర్ధరాత్రో పట్టేదట! ఆమె ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తుందా, వంటను బా....గా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తుందా అనేది ఎవరికి తెలియదుగానీ...‘నాంచరమ్మ వంట’ అంటే జనాలు భయపడే స్థితికి చేరుకున్నారు. ఏదైనా విషయం ఎటూ తేల్చకపోతే, పనిలో అకారణ జాప్యం జరిగితే ‘నాంచారమ్మ వంట’తో పోల్చడం పరిపాటిగా మారింది. చుట్టాల సురభి కొందరు... చుట్టాలు అనే మాట వినగానే వెనక్కి చూడకుండా పారిపోతారు. కొందరికి చుట్టాలు అంటే వల్లమాలిన ప్రేమ. తమ తాహతుకు మించి ఇంటికొచ్చిన చుట్టాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. దీని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే... తమ వైఖరి మార్చుకోరు. ఇలాంటి వ్యక్తులను ‘చుట్టాల సురభి’తో పోల్చుతుంటారు. ‘ఇంటి కొచ్చిన చుట్టానికి ఏ లోటూ రానివ్వడు. ఆయన చుట్టాల సురభి’ అంటారు. క్షీర సాగర మథనంలో జన్మించిన దేవధేనువు కామధేనువు. ఈ కామధేనువు కోరిన కోరికలన్నీ తీరుస్తుందని ప్రసిద్ధి. అలాగే ఇంటికి వచ్చిన చుట్టం అడిగినా, అడగకపోయినా... వారి కోరికలు తీర్చేవారిని చుట్టాల సురభి అంటారు. పయోముఖ విషకుంభం! కొందరు చూడడానికి అమాయకంగా కనిపిస్తారు. కానీ చేయాల్సినంత చెడు చేస్తారు. ఇలాంటి వారిని ఉద్దేశించి ఉపయోగించే జాతీయం ‘పయోముఖ విషకుంభం’ విషం నిండిన కుండ (కుంభం)పై ముఖం(పై భాగం)లో పయస్సు (పాలు) ఉంచితే అదే పయోముఖవిషకుంభం. స్థూలంగా చెప్పాలంటే... చూడడానికి ఒక రకంగా, చేతల్లో ఒక రకంగా కనిపించే వ్యక్తులను ‘పయోముఖ విషకుంభం’తో పోల్చుతారు. కాకతాళీయం! అనుకోకుండా రెండు సంఘటనలు ఒకే సమయంలో జరిగితే ఉపయోగించే మాట... కాకతాళీయం! తాళవృక్షం (తాడి చెట్టు) మీద కాకము(కాకి) వాలిన క్షణమే... తాళఫలం (తాటిపండు) నేలరాలింది... ఇదే కాకతాళీయం. పై సంఘటనలో కాకి తాడిచెట్టు మీద వాలడానికి, తాడిపండు నేలరాలడానికి ఎలాంటి సంబంధం లేదు. తాడిచెట్టు మీద కాకి వాలడం వల్లే, తాటిపండు నేలరాలింది అనడం తప్పు అవుతుంది. చెట్టుపై కాకి వాలడం, తాటిపండు నేలరాలడం అనేవి పూర్తిగా యాదృచ్ఛికం అని చెప్పడమే కాకతాళీయం! -
చిట్టిల పేరుతో ఘరానా మోసం
చిట్టిల పేరుతో ఓ మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపి పెట్టి.... అర్థరాత్రి తట్టా బుట్టా సర్ధుకుని ఉడాయించింది. ఆ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని రెల్లి కాలనీలో చోటు చేసుకుంది. రెల్లి కాలనీలో నివసిస్తున్న నాంచరమ్మ అనే మహిళ స్థానిక మహిళలతో ఎంతో చనువు, నమ్మకంగా ఉంటూ వారితో చీటీలు కట్టించుకుంటుంది.ఆ క్రమంలో కొంత కాలం వరకు సక్రమంగా చిట్టిల డబ్బులు చెల్లించేది. కొంతకాలం తర్వాత నగదు చెల్లించాలంటూ చిట్టిల కట్టిన సదరు మహిళలు వస్తుండటంతో తర్వాత ఇస్తానంటూ చెబుతు వస్తుంది. దాంతో చిట్టి వేసిన మహిళలు తమకు డబ్బు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. దాంతో గత అర్థరాత్రి ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ విషయాన్ని గమనించిన బాధితులు లబోదిబోమంటూ బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.