ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా ? | Chief Minister Chandrababu Naidu is third round Janmabhoomi | Sakshi
Sakshi News home page

ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా ?

Jan 3 2016 12:49 AM | Updated on Aug 13 2018 3:58 PM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడో విడత జన్మభూమి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు మూడో విడత జన్మభూమి అంటూ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. గతంలో ఇచ్చిన 15 వాగ్దానాల్లో ఒక్కటైనా అమలుచేశారా? అని ప్రశ్నించింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో విడత జన్మభూమిలో దీనిపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని రాష్ర్ట ప్రజలకు పిలుపునిచ్చింది.    
 
 1.     రైతన్నల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా?
     కనీసం వడ్డీ అయినా మాఫీ అయిందా?
 2.     ఆడపడుచుల డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా?
 3.     {పతి ఇంటికీ ఒక ఉద్యోగం, అది ఇచ్చేవరకు ప్రతి ఇంటికీ     నెలకు రూ.2 వేల భృతి ఇస్తున్నారా?
 4.     కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారా? హోంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు,
     విద్యావాలంటీర్ల క్రమబద్ధీకరణ చర్యలు తీసుకున్నారా?
 5.     బెల్టుషాపులు రద్దు అయ్యాయా?
     మద్యం దుకాణాలు పెరగలేదా?
 6.     పేదలందరికీ మూడు సెంట్లలో రూ.లక్షన్నరతో
     పక్కా ఇల్లు ఒక్కరికైనా ఇచ్చారా?
 7.     గ్యాస్ సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు... ఇస్తున్నారా?
 8.     ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాం
     అన్నారు... ఇచ్చారా?
 9.    బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఏటా రూ.10 వేల కోట్లు పెడతాం అన్నారు.. ఇచ్చారా?
 10. కాపుల కోసం బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్లు అన్నారు.
     ఈ రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఇచ్చారా? బీసీలకు దెబ్బ
     తగలకుండా కాపులను బీసీలుగా చేస్తానన్నారు. చేశారా?
 11. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
     మీ ఏడాదిన్నర పాలనలో కొంతైనా  ముందుకు కదిలిందా?
 12. నేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు?రూ1.5 లక్షలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు నిర్మించి ఇచ్చారా?
           తాను  ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉన్న చేనేత రుణాలన్నీ రద్దు చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు...
     అమలయ్యాయా?
 13.    భూమి లేని పేదవారికి రెండు ఎకరాల
     భూమి ఇస్తానన్నారు...  ఇచ్చారా?
 14. లారీ, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు వాహనాల కొనుగోలుకు
     వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు. ఇచ్చారా?
 15.    అవినీతి లేని పరిపాలన అందిస్తామన్నారు.
     అందిస్తున్నారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement