శ్రీశైలమహాక్షేత్రానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద చిరుతపులి కలకలం రేపింది.
శ్రీశైలమహాక్షేత్రానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద చిరుతపులి కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. శ్రీశైలం ప్రాజక్టు కాలనీ నుంచి శ్రీశైలానికి వస్తుండగా.. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ముఖద్వారం సమీపంలో చిరుత ఘాట్ రోడ్డు దాటుతూ కనిపించిందని తెలిపారు. తాము భయపడి టూ వీలర్ ఆపేశామని తెలిపారు. వెంటనే దేవస్థానం, అటవీ అధికారులకు సమాచారం అందించామని వివరించారు. కాగా ఇటీవలే క్షేత్రపరిధిలోని మేకల బండ చెంచుగూడెం సమీపంలో పెంపుడు మేకలపై చిరుతలు దాడి చేసి గాయపరిచిన విషయం తెల్సిందే. సున్నిపెంట నుంచి శ్రీశైలం క్షేత్రానికి టూ వీలర్‌పై వచ్చే వారు, వెళ్లేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని దేవస్థానం మైకుల ద్వారా ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. కాగా అటవీ అధికారుల కృషితో నల్లమల అభయారణ్యంలో జంతువుల సంతతి పెరిగింది. వీటితో పాటు.. చిరుతల సంఖ్య కూడా పెరిగినట్లు సమాచారం.