ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్లో ఆయన ...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 9.55 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాబు 12 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.
12.30 గంటల నుంచి ఒంటిగంట వరకూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) డైరెక్టర్ జనరల్ ఇంద్రజిత్ బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఇండియన్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో 'యునైటింగ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా' అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం బాబు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారు.