చంద్రబాబు ప్రవర్తన బాధాకరం... | chandrababu naidu should tender apology : ysrcp mla srikanth reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రవర్తన బాధాకరం...

Sep 5 2014 10:25 AM | Updated on Aug 18 2018 5:15 PM

చంద్రబాబు ప్రవర్తన బాధాకరం... - Sakshi

చంద్రబాబు ప్రవర్తన బాధాకరం...

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని ప్రకటన సందర్భంగా గురువారం సభలో తప్పు సమాచారం ఇచ్చిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1953లో కర్నూలు రాజధాని కోసం చర్చ జరిగిందని .... అందుకు సాక్షిగా నాటి దినపత్రికలను శ్రీకాంత్ రెడ్డి మీడియాకు చూపారు.


నిన్నటి సభలో చంద్రబాబు ప్రవర్తన బాధాకరంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని, అన్యాయంపై మాట్లాడకుండా మానోరు నొక్కారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు. వెనుకబడిన రాయలసీమను విస్మరించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. రాయలసీమలోని సహజ వనరులను పూర్తిగా వినియోగించి అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు భరోసా కల్పించాల్సిన పరిస్థితి టీడీపీ సర్కార్పై ఉందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement