వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిని బెయిల్ పిటిషన్ అడ్డుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా అప్రజాస్వామికమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిని బెయిల్ పిటిషన్ అడ్డుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా అప్రజాస్వామికమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వైఖరి ఏ మాత్రం సమంజసంగా లేదని విశాలాంధ్ర ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు విచిత్రమైన వాదనలు చేస్తున్నారని తెలిపారు.
జగన్ బెయిల్‌పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ నేతలు దిగజారి ఆరోపణలు చేయడం సరికాదని హితబోధ చేశారు.