చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి | chandra babu naidu will be no where in the history, says ummareddy venkateswarlu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి

Oct 31 2014 3:31 PM | Updated on Jul 28 2018 6:33 PM

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి - Sakshi

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, దాంతో మంత్రులు గానీ, టీడీపీ ఎమ్మెల్యేలు గానీ గ్రామాల్లో ఎక్కడా తిరగలేకపోతున్నారని ఆయన అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మారెడ్డి చెప్పారు.

బ్యాంకుల్లో రైతులు, మహిళల గౌరవాన్ని చంద్రబాబు భంగపరిచారని ఆయన మండిపడ్డారు. రైతులు తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని ఓపక్క వేలం వేయిస్తూ, మరోపక్క రుణమాఫీ పేరుతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మోసం, వంచనలకు మారుపేరు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని చెప్పారు. కుల రాజకీయాలను చంద్రబాబు పెంచి పోషించారని భూమన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement