ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సూరయ్య కుటుంబంపై అక్రమ కేసులను ఎత్తేయాలని, లేనిపక్షంలో తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని అన్నారు.
పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగం చేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారని అన్నారు. మరో నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి కూడా చంద్రబాబుపైన, టీడీపీపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు పాలన రాక్షస పాలనను తలపిస్తోందని ఆయన అన్నారు.