చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏలూరు(పశ్చిమగోదావరి): మహిళ మెడల్లో బంగారు చైన్ కనిపిస్తే చాలు అతని చేతుల్లో దురద మొదలవుతోంది. ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లి వాటితో జల్సా చేయడమే అతని పని. అటువంటి దొంగను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 11 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంటరి మహిళల వెనుక తిరుగుతున్న జోజు(24)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించగా అసలు విషయం తెలిసింది. గతంలో అతనిపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.