కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం దుర్మార్గమైన, అన్యాయమైన, అక్రమమైన చర్య అని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు.
కేంద్ర నిర్ణయం దుర్మార్గపు చర్య: కాసు
Oct 4 2013 4:19 AM | Updated on Mar 18 2019 9:02 PM
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం దుర్మార్గమైన, అన్యాయమైన, అక్రమమైన చర్య అని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం రాత్రి సాక్షితో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొట్టమొదటగా రాజీనామాలేఖను సీఎంకు తానే అందించానని, శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఆ లేఖను గవర్నర్‌కు పంపి ఆమోదింప చేయాలని కోరతానని చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలతో సమావేశమయ్యాక తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
Advertisement
Advertisement