డీవైడర్‌ను ఢీకొట్టిన పల్సర్... వ్యక్తి మృతి | car hits the devider, one man died | Sakshi
Sakshi News home page

డీవైడర్‌ను ఢీకొట్టిన పల్సర్... వ్యక్తి మృతి

Feb 8 2015 2:55 PM | Updated on Sep 2 2017 9:00 PM

గుంటూరు నగరం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

గుంటూరు రూరల్: గుంటూరు నగరం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎ.విజయభాస్కర్(48) గుంటూరులోని నవభారత్ కాలనీలో ఓ ఫర్నిచర్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతడు మరో ఇద్దరితో కలసి పల్సర్ బైక్‌పై నవభారత్ కాలనీ నుంచి గుంటూరు వైపు వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాకుండా, రాసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో విజయభాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు విజయభాస్కర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement