పశ్చిమగోదావరిలో బంద్ పాక్షికం | bundh in west godavari district | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరిలో బంద్ పాక్షికం

Jan 23 2016 8:20 AM | Updated on Sep 3 2017 4:10 PM

దళిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం బంద్ పాక్షికంగా కొనసాగుతోంది.

ఏలూరు: దళిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. దళిత సంఘాల జేఏసీ నాయకులు ఏలూరు బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్నారు. అయితే, దుకాణాలు యథావిధిగానే తెరచుకుంటున్నాయి. బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. తణుకు పట్టణం సహా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement