తెల్లవారితే పెళ్లి పీటల మీద కూర్చోవలసిన ఆ యువతి ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది.
విశాఖపట్నం: తెల్లవారితే పెళ్లి పీటల మీద కూర్చోవలసిన ఆ యువతి ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. పెళ్లి వారింట పెను విషాదం నెలకొంది. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరులో చోటుచేసుకుంది.
భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటితూరుకు చెందిన చిల్ల ఎర్రయ్యమ్మ(18) గురువారం ఉదయం వంట చేసేందుకు పొయ్యి వెలిగిస్తుండగా నిప్పంటుకుంది. మంటలు శరీరమంతటికీ వ్యాపించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబీకులు వచ్చి మంటలు ఆర్పారు. బాధితురాలిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. మృతురాలికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది.