కొందరికి లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక రాజధాని! | Botsa Satyanarayana opposes Vijayawada as Temporary capital | Sakshi
Sakshi News home page

కొందరికి లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక రాజధాని!

Aug 12 2014 9:23 PM | Updated on Sep 2 2017 11:47 AM

కొందరికి లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక రాజధాని!

కొందరికి లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక రాజధాని!

తాత్కాలిక రాజధానిగా విజయవాడ ఏర్పాటుపై మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు.

విశాఖపట్నం: తాత్కాలిక రాజధానిగా విజయవాడ ఏర్పాటుపై మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు.  టీడీపీలోని కొందరు వ్యక్తులకు ఆర్ధిక లాభం చేకూర్చడానికే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉండగా మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని బొత్స ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తామని బొత్స అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement