ఆశీర్వాదం | Blessing | Sakshi
Sakshi News home page

ఆశీర్వాదం

Aug 28 2015 2:22 AM | Updated on Jul 28 2018 3:23 PM

ఆశీర్వాదం - Sakshi

ఆశీర్వాదం

తిరుపతి సిటీ: సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వివాహానికి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

తిరుపతి సిటీ: సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వివాహానికి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఆదిత్య వివాహానికి సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ఫొటో దిగారు. అంతకుముందు వైఎస్సార్ సీపీ  జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదిత్య దంపతులను ఆశీర్వదించారు.

సీఎంతో పాటు విప్ మేడా మల్లికార్జునరెడ్డి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, డీకే.సత్యప్రభ, శంకర్‌యాదవ్, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయు డు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ, జిల్లా కలెక్టర్ సిద్ధార్‌‌థ జైన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, టీడీపీ నేతలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ రాయ ఆశాలత పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement