వాకతిప్ప దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాణాసంచా పేలుడు సంభవించింది.
మచిలీపట్నం: వాకతిప్ప దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాణాసంచా పేలుడు సంభవించింది. అనుమతి లేకుండా బాణాసంచా తయారుచేస్తున్న ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జోగి కిరణ్(22) అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
గాయపడిన వారిని జోగి నాగలక్ష్మి, తులసి గా గుర్తించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన భారీ విస్పోటంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు.