‘హోదా’పై అప్పుడు నోరెత్తలేదేం? | BJP leaders takes on TDP leaders | Sakshi
Sakshi News home page

‘హోదా’పై అప్పుడు నోరెత్తలేదేం?

Apr 26 2015 2:02 AM | Updated on Mar 29 2019 5:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఎదుగుదల అవకాశాలను చూసి ఓర్వలేని వారే ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకొని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించారు.

టీడీపీ నేతలపై బీజేపీ విమర్శలు
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఎదుగుదల అవకాశాలను చూసి ఓర్వలేని వారే ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకొని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించారు.  పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల, కార్యదర్శి వేణుగోపాల్‌లు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  తెలంగాణ టీడీపీ ఎంపీ ఆ రోజు చర్చలో పోలవరానికి వ్యతిరేకంగా మాట్లాడినా సీఎం రమేష్, సుజనాచౌదరిలు కనీసం తప్పుపట్టలేదని గుర్తు చేశారు.  ప్రత్యేకహోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement