బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం | BJP celebrates Modi's anointment | Sakshi
Sakshi News home page

బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

Sep 14 2013 12:34 AM | Updated on Mar 29 2019 9:13 PM

భారతీయ జనతాపార్టీ అధిష్టానం 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరెంద్రమోడీని ప్రకటించడం పట్ల జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెల కొంది.

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: భారతీయ జనతాపార్టీ అధిష్టానం 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరెంద్రమోడీని ప్రకటించడం పట్ల జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెల కొంది. ప్రకటన వెలువడటంతో పట్టణంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలో బాణసంచా కాలుస్తూ మిఠాయి పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కాబోయే ప్రధాని నరెండ్రమోడియేనంటూ నినాదాలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరెంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీ కేంద్ర న్యాయకత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి నాగరాజ్, మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.కల్పన, జిల్లా నాయకురాలు అనురాధారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కసినివాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement