బయోమెట్రిక్ ద్వారా సాగుతున్న సంక్షేమ పింఛన్‌లు, ఉ పాధి హమీ పథకం కూలి చెల్లింపుల ప్రక్రియను ఆధార్‌తో అనుసంధానం చేయడం నెల రోజులకు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఆధార్‌తో లబ్ధిదారుల వేలి ము ద్రలు సరితూగితేనే చెల్లింపులు జరపాల్సి ఉంది.
మోర్తాడ్, న్యూస్‌లైన్ : బయోమెట్రిక్ ద్వారా సాగుతున్న సంక్షేమ పింఛన్‌లు, ఉ పాధి హమీ పథకం కూలి చెల్లింపుల ప్రక్రియను ఆధార్‌తో అనుసంధానం చేయడం నెల రోజులకు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఆధార్‌తో లబ్ధిదారుల వేలి ము ద్రలు సరితూగితేనే చెల్లింపులు జరపాల్సి ఉంది. ఈ విధానాన్ని ఈ నెలతోనే ఆరంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే ఆధార్ కార్డులకు సంబంధించిన డాటా బయోమెట్రిక్ మిషన్‌లకు ఎక్కించాల్సి ఉంది. అయితే ఆధార్‌కు సంబంధించి న డాటా కార్డులు ఇప్పటివరకు అందకపోవడంతో ఆధార్‌తో అనుసంధానం చేసే విధానాన్ని వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. ఆధార్‌తో అనుసంధానం విషయంపై బ్రాంచి పోస్టు మాస్టర్‌లకు శిక్షణ ఇచ్చారు.
ఒక దశలో బయోమెట్రిక్ మిషన్‌ల ను అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఆధార్ డాటా కార్డులు రాకపోవడంతో బయోమెట్రిక్ మిషన్‌లను మళ్లీ తపాల సిబ్బంది కి ఇచ్చి వేశారు. కాగా ఇప్పటివరకు ఆధార్ కార్డులను పొందని లబ్ధిదారులు, ఉపాధి కూలీలు నెల రోజుల వ్యవధిలో ఆధార్ కా ర్డులను పొంది జిరాక్స్ కాపీలను గ్రామాల్లోని తపాల సిబ్బందికి అందజేస్తే వచ్చే నెల నుంచి చెల్లింపులకు ఎలాంటి ఆటంకం ఉం డదు. సెప్టెంబర్‌లోనే ఆధార్ అనుసంధానానికి ముహుర్తం కుదరడంతో వచ్చే నెలలో చెల్లింపులకు ఎక్కువ సమయం పట్టనుం ది. బయోమెట్రిక్‌లో వేలి ముద్ర ఒకటే సరిపోతుంది. ఆధార్ కా ర్డులను అనుసంధానం చేయడం వల్ల ఏవైనా మూడు వేలి ము ద్రలు సరితూగాలి. సంక్షేమ పింఛన్‌లకు సంబంధించి లబ్ధిదారు లు అనారోగ్యానికి గురైతే వారి పింఛన్‌లను రక్త సంబంధీకులు తీసుకునే అవకాశం ఉండేది. ఆధార్‌తో అనుసంధానం వల్ల అ లాంటి పింఛన్‌లు చెల్లించడం కుదిరే అవకాశం లేదు