కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎస్సీవీ నాయుడు ప్రథమ అనుచరుడు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పొనుగోటి భక్తవత్సలనాయుడు తన అనుచరులు 500 మందితో మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు.
శ్రీకాళహస్తి రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎస్సీవీ నాయుడు ప్రథ మ అనుచరుడు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పొనుగోటి భక్తవత్సలనాయుడు తన అనుచరులు 500 మంది తో మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు.
మండలంలోని వాంపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచుకున్నారు.
ఆయనతోపాటు పార్టీలో చేరిన వారిలో సుబ్బారావునాయుడు, శాంతారావునాయుడు, తిరుపాల్ నాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, సుబ్బానాయుడు, రాజానాయుడు, భాస్కర్, అరుణాచలం, యూర్లపూడి రామచంద్రారెడ్డి ఉన్నారు.