రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ | BC Sub-Plan should be 20 thousand crores: R Krishnaiah | Sakshi
Sakshi News home page

రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్

Oct 21 2013 3:31 AM | Updated on Sep 1 2017 11:49 PM

రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

 హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ రుణాలపై సబ్సిడీని రూ.30 వేల నుంచి లక్షకు పెంచాలన్నారు. ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన 22 బీసీ సంఘా ల భేటీలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సు ల పూర్తి ఫీజుల్ని సర్కారే భరించి రూ.35 వేల పరిమితిని ఎత్తివేయాలన్నారు.
 
 వీరశైవ లింగాయత్  నూతన కార్యవర్గం: ఇదే సమావేశంలో వీరశైవ లింగాయత్ కొత్త కార్యవర్గాన్ని కృష్ణయ్య ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా పట్లోల్ల సంగమేశ్వర్, అధ్యక్షుడిగా బెడఖాని హన్మంతు, సెక్రటరీ జనరల్‌గా వెన్న ఈశ్వరప్ప, ఉపాధ్యక్షుడిగా ఎం.వీరయ్య, కార్యదర్శిగా చంద్రకాంత్ పాటిల్, కోశాధికారిగా ఎ.చంద్రశేఖర్‌ను నియమించారు.
 
 ఆర్‌ఎంపీలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి: రాష్ట్రంలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి వారికి మెడికల్ డిప్లొమా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ జరిగిన తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక ‘శంఖారావం’ రాష్ట్ర సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టుకోవడానికి ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం 50% సబ్సిడీపై 2 నుంచి రూ.5 లక్షల వరకు రుణాలందించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement