గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం | Balakrishna condolence to gail victims | Sakshi
Sakshi News home page

గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం

Jun 27 2014 7:20 PM | Updated on Aug 29 2018 1:59 PM

గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం - Sakshi

గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం

గెయిల్ పైపులైన్ పేలుడు దుర్ఘటనపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా గెయిల్ పైపులైన్ పేలుడు దుర్ఘటనపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలక ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మామిడికుదురు మండలం నగరం వద్ద శుక్రవారం గ్యాస్ పైపులైన్ పేలడంతో 15 మంది మరణించారు. మరో 25 మంది గాయపడగా, వీరిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయిల చొప్పున ఎక్స్ గ్రేసియా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement