వచ్చే నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

Assembly meetings from 6th of next month! - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వారం నుంచి పదిరోజులపాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక సచివాలయంలో మంగళవారం జరిగిన శాఖాధికారులు, విభాగాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు.

వాస్తవానికి ఈ నెలలోనే సమావేశాలు నిర్వహించాలని భావించినా పలు కారణాల వల్ల సాధ్యం కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ సమావేశాలు జరిగాయి. ఆరు నెలలు కావస్తుండడంతో మళ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top