మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ.. కొండగట్టు అంజన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం రాష్ట్రనలుమూలల నుంచి సుమారు 1.20 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

దీంతో అధికారులు వేకువజాము ఐదు గంటల నుంచే భక్తులకు సర్వదర్శనానికి అనుమతినిచ్చారు. ఏర్పాట్లను ఈవో రాజేశ్వర్, ఏఈవో శ్రీనివాస్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఎస్సై విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబసు నిర్వహించారు.
- న్యూస్‌లైన్, మల్యాల