గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ నేతలు | AP congress leaders meet governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ నేతలు

Oct 17 2015 10:04 AM | Updated on Mar 23 2019 9:10 PM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం 11 గంటలకు భేటీకానున్నారు.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ఏపీకి  ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ,  కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబులపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టిన విషయం విదితమే. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement